చిరూ, కొరటాల సినిమా కోసం భారీ సెట్టింగ్స్
Advertisement
చిరంజీవి తాజా చిత్రంగా 'సైరా' రూపొందుతోంది. చారిత్రక నేపథ్యంలో నిర్మితమవుతోన్న ఈ సినిమాను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆగస్టు 22న ఈ సినిమా నుంచి ట్రైలర్ రానున్నట్టుగా తెలుస్తోంది. ఇదే రోజున కొరటాలతో చిరూ సినిమాను లాంచ్ చేయనున్నట్టు సమాచారం.

ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారుల్లో ప్రత్యేకంగా భారీ సెట్స్ ను వేస్తున్నారట. చాలా వరకూ ఈ సెట్టింగ్స్ లోనే షూటింగు జరుగుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందువలన ఇద్దరు కథానాయికల అవసరం వుంది. ఒక కథానాయిక పాత్ర కాస్త డీసెంట్ గా వుండే పాత్ర కావడంతో, నయనతారనే అనుకుంటున్నారట. మరో కథానాయిక కోసం కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఆ ఛాన్స్ ఏ కథానాయికకు దక్కుతుందో చూడాలి.
Sat, Jun 29, 2019, 12:34 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View