నాన్న చేసిన పాత్రల్లో 'షేర్ ఖాన్' పాత్ర ఇష్టం: శ్రీహరి తనయుడు మేఘాంశ్
Advertisement
శ్రీహరి తనయుడు మేఘాంశ్ 'రాజ్ దూత్' సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 'రాజ్ దూత్' సినిమా షూటింగును చాలా సీక్రెట్ గా చేస్తూ వచ్చాము. రెండు నెలల్లో షూటింగును పూర్తి చేశాము.

హైదరాబాద్ .. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కువభాగం చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా నాకు తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది" అని అన్నాడు. ఇక తన తండ్రి శ్రీహరి గురించి ప్రస్తావిస్తూ .. "మా నాన్నగారు చేసిన సినిమాల్లో 'భద్రాచలం' అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఆయన పోషించిన పాత్రలో 'షేర్ ఖాన్' పాత్ర అంటే ఎంతో ఇష్టం. ఆయన చేసిన సినిమాలు చూసి బాగుందంటే ఆయన ఎంతో సంతోషపడిపోయేవారు" అని చెప్పుకొచ్చాడు. 
Sat, Jun 29, 2019, 11:07 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View