సూర్య యాక్షన్ సినిమాకి టైటిల్ ఖరారు
Advertisement
సూర్య కథానాయకుడిగా తమిళంలో 'కాప్పన్' సినిమా నిర్మితమైంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో, మోహన్ లాల్ .. ఆర్య కీలకమైన పాత్రలను పోషించారు. కథానాయికగా సాయేషా సైగల్ అలరించనుంది. ఈ సినిమాను ఆగస్టు 30వ తేదీన విడుదల చేయనున్నారు.

సూర్య తన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేస్తుంటారు. అలాగే 'కాప్పన్' సినిమాను కూడా తెలుగులో అదే రోజున విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకి తెలుగులో 'బందో బస్త్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. స్పెషల్ కమాండో ఆఫీసర్ గా సూర్య కనిపించే ఈ సినిమాలో, బొమన్ ఇరాని .. సముద్రఖని ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో అతిథి పాత్రలో కార్తీ మెరవనుండటం విశేషం. హారీస్ జైరాజ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.
Fri, Jun 28, 2019, 05:07 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View