'రణరంగం' టీజర్ రిలీజ్ కి రంగం సిద్ధం
Advertisement
సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా 'రణరంగం' నిర్మితమైంది. డిఫరెంట్ లుక్స్ తో శర్వానంద్ కనిపించే ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా కాజల్ - కల్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది.

రేపు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకి టీజర్ ను వదలనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో రఫ్ లుక్ తో శర్వానంద్ ఆకట్టుకుంటున్నాడు. టీజర్ తోనే ఈ సినిమాపై అంచనాలను పెంచేయాలనే ఆలోచనలో వున్నారు. ఇంతకుముందు శర్వానంద్ చేసిన 'పడి పడి లేచె మనసు' పరాజయంపాలు కావడంతో, ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలనే ఆశతో ఆయన వున్నాడు. కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ పరిస్థితి కూడా అంతే. వాళ్లకి కూడా ఈ సినిమా సక్సెస్ కావడం చాలా అవసరం.
Fri, Jun 28, 2019, 04:45 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View