రేపే 'ఓ బేబీ' ప్రీ రిలీజ్ ఈవెంట్
Advertisement
సమంత ప్రధాన పాత్రధారిగా 'ఓ బేబీ' సినిమా రూపొందింది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చేనెల 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని 'జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్' లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇంతకు ముందు లేడీ ఓరియెంటెడ్ సినిమాగా సమంత చేసిన 'యూ టర్న్'కి మంచి ఆదరణ లభించింది. దాంతో సహజంగానే 'ఓ బేబీ'పై అందరిలో ఆసక్తి వుంది. ఆల్రెడీ ఈ కథ ఏడు భాషల్లో విజయాన్ని సాధించిందని సమంత చెప్పడంతో, ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను 'ఓ బేబీ' ఎంతవరకూ అందుకుంటుందో చూడాలిమరి.
Fri, Jun 28, 2019, 04:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View