రెజీనాతో నాకు మీరు అనుకునే సంబంధం లేదు: సందీప్ కిషన్
Advertisement
ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని... తన జీవితంలో ఏ అమ్మాయి లేదని హీరో సందీప్ కిషన్ చెప్పాడు. రెండేళ్ల క్రితం వరకు ఒక అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నానని... ఆ తర్వాత కట్ అయిందని తెలిపాడు. ఆ అమ్మాయి పేరు చెప్పడం తప్పని... ప్రస్తుతం ఆమె జీవితాన్ని ఆమె గడుపుతోందని, తన జీవితాన్ని తాను గడుపుతున్నానని... ఆమె పేరు చెప్పలేనని అన్నాడు. విడిపోయిన వ్యక్తి గురించి చెప్పడం సబబు కాదని చెప్పాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ ఈ మేరకు వివరించాడు.

హీరోయిన్ రెజీనాతో తనకు ఏదో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని... అవన్నీ పుకార్లు మాత్రమేనని సందీప్ కిషన్ తెలిపాడు. తామిద్దరం మంచి మిత్రులమని... ఈ ఉదయం కూడా ఫోన్ లో మాట్లాడుకున్నామని చెప్పాడు.
Fri, Jun 28, 2019, 03:18 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View