సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  తాజాగా పూర్తయిన 'సైరా' చిత్రంలో చిరంజీవి సరసన నటించిన నయనతార మరోసారి ఆయనతో జతకట్టనుంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ రూపొందించే చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు వుంటారు. వీరిలో ఒకరిగా నయనతారను ఎంచుకున్నట్టు సమాచారం.
*  'ధడక్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్న శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ మరో  చిత్రానికి ఓకే చెప్పింది. 'దోస్తానా' సీక్వెల్ 'దోస్తానా 2'లో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్ గా జాన్వి నటిస్తుంది.
*  ఇటీవల సక్సెస్ లేక వెనుకపడిన దర్శకుడు సంపత్ నంది ఇప్పుడు మరో చిత్రాన్ని ప్లాన్ చేసుకుంటున్నాడు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించనున్నాడు. సంపత్ చెప్పిన కథకు కల్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  
Fri, Jun 28, 2019, 07:03 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View