'రాజ్ దూత్' నుంచి హుషారైన సాంగ్
Advertisement
శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా .. నక్షత్ర హీరోయిన్ గా 'రాజ్ దూత్' సినిమా నిర్మితమైంది. బైక్ చుట్టూ తిరిగే ఒక విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. "చూస్తూనే వున్నా చూస్తున్నా .. నా కళ్లు కాయలు కాస్తున్నా .. ఈ సీను ముందుకు జరగదెలా .. పేషన్స్ లాసై పోతున్నా .. " అంటూ ఈ పాట సాగుతోంది.

యూత్ లోని జోరును .. హుషారును ఆవిష్కరించేలా ఈ పాట వుంది. మాస్ ను సైతం ఆకట్టుకునేలా వరుణ్ సునీల్ బాణీ కట్టడం విశేషం. కిట్టూ సాహిత్యం .. వరుణ్ సునీల్ - సూరజ్ సంతోష్ ఆలాపన బాగున్నాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తొలి సినిమాతో శ్రీహరి తనయుడు హిట్ కొడతాడేమో చూడాలి మరి.
Thu, Jun 27, 2019, 05:00 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View