'సైరా'లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పేసిన చిరూ
Advertisement
చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతోంది. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలు పెట్టేశారు. ముందుగా చిరంజీవి తన పాత్రకి డబ్బింగ్ చెప్పేశారు. 20 గంటల్లో చిరంజీవి తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం పూర్తిచేయడం గురించి ఫిల్మ్ నగర్లో ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు.

చారిత్రక నేపథ్యంతో కూడిన ఇంతటి భారీ చిత్రానికి ఇంత త్వరగా ఆయన డబ్బింగ్ పూర్తి చేయడం విశేషమని అంటున్నారు. సుదీప్ తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోనుండగా, విజయ్ సేతుపతి పాత్రకి మాత్రం వేరొకరితో డబ్బింగ్ చెప్పించనున్నారు. నయనతార కథానాయికగా చేస్తోన్న ఈ సినిమాలో, ఓ ముఖ్యమైన పాత్రలో తమన్నా కనిపించనుంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేసి, సినిమాను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేసే ఆలోచనలో వున్నారు. 
Thu, Jun 27, 2019, 04:13 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View