కృష్ణగారి పరిస్థితి చూస్తుంటే భయమేస్తోంది... ఆయనను ఎవరైనా లోపలికి తీసుకెళితే బాగుండును!: పరుచూరి గోపాలకృష్ణ
Advertisement
ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మరణంతో టాలీవుడ్ మూగబోయింది. ఆమెతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ విషాదంలో మునిగిపోయారు. ఆమె కుటుంబసభ్యుల బాధ వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో, విజయనిర్మల మరణంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. విజయనిర్మల కన్నుమూయడంతో కృష్ణ పసిపిల్లాడిలా మారిపోయాడని, ఆయన విలపిస్తున్న తీరు చూస్తుంటే భయమేస్తోందని అన్నారు. ఎవరైనా కృష్ణగారిని లోపలికి తీసుకెళితే బాగుండుననిపిస్తోందని విచారం వ్యక్తం చేశారు. విజయనిర్మల చనిపోయిందన్న వార్త తెలియగానే తాను మొదట ఆలోచించింది కృష్ణగారి గురించేనని, ఆయన పరిస్థితి ఏంటన్న విషయం తలుచుకోగానే గుండె కలుక్కుమందని అన్నారు. ఇలాంటి విషాద సమయంలో కృష్ణగారికి ఆత్మస్థయిర్యం కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
Thu, Jun 27, 2019, 03:18 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View