ఎన్టీఆర్ గురించి నేనసలు మాట్లాడలేదు: మేఘాంశ్ శ్రీహరి
Advertisement
శ్రీహరి - శాంతి దంపతుల తనయుడైన మేఘాంశ్ శ్రీహరి, 'రాజ్ దూత్' సినిమా ద్వారా పరిచయమవుతున్నాడు. కార్తీక్ - అర్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గురించి మేఘాంశ్ శ్రీహరి మాట్లాడారు. "నన్ను హీరోను చేయడమనేది మా నాన్న కల .. దానిని నిజం చేయడం కోసమే నేను నటన వైపుకు వచ్చాను.

నాన్న వుంటే నాకు ఆయన గైడెన్స్ ఉండేది .. ఆయన లేకపోవడం నిజంగా పెద్దలోటే. నాన్నని కోల్పోయిన తరువాత అటు అమ్మతరఫు వాళ్లు .. ఇటు నాన్న తరఫు వాళ్లు అండగా నిలబడి అన్నీ చూసుకున్నారు. మాకు ఎన్టీఆర్ సాయం చేశాడని నేను 'రాజ్ దూత్' ఆడియో వేడుకలో చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. నిజానికి నేనసలు ఎన్టీఆర్ గురించి ఏమీ మాట్లాడలేదు. అలా ఎందుకు రాశారన్నది నాకు అర్థం కాలేదు. నేను అభిమానించే హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు" అని చెప్పుకొచ్చాడు.
Thu, Jun 27, 2019, 02:02 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View