మంచు పర్వతాల్లో ప్రభాస్ - శ్రద్ధా కపూర్ డ్యూయెట్
Advertisement
ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, టాకీ పార్టును పూర్తిచేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ పాటల చిత్రీకరణ పనిలో వుంది. పాటల చిత్రీకరణ కోసం ఈ సినిమా టీమ్ ఇటీవల ఆస్ట్రియా వెళ్లింది. ఆ దేశంలోని ఆల్ప్స్ పర్వతాల్లో ప్రభాస్ - శ్రద్ధా కపూర్ లపై ఒక డ్యూయెట్ ను చిత్రీకరిస్తున్నారు.

మంచు పర్వతాల్లో చిత్రీకరిస్తోన్న ఈ రొమాంటిక్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, మురళీ శర్మ .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 
Thu, Jun 27, 2019, 12:49 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View