హైదరాబాద్ లో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను: హీరోయిన్ నివేదా థామస్
Advertisement
తెలుగులో తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకున్న నివేదా థామస్, ఆ తరువాత తొందరపడకుండా తనకి నచ్చిన కథలను మాత్రమే ఓకే చేస్తూ వెళుతోంది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'బ్రోచేవారెవరురా' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా వుంది.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " బంధాలు .. భావోద్వేగాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో నా పాత్ర ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగులో బిజీ అవుతున్న కారణంగా తమిళ .. మలయాళ సినిమాల సంఖ్యను తగ్గించాను. హైదరాబాదులో ఇల్లు తీసుకోవాలనే ఆలోచనలో వున్నాను. త్వరలోనే ఆ పని పూర్తవడం .. నేను ఇక్కడికి షిఫ్ట్ కావడం జరిగిపోతాయి" అని చెప్పుకొచ్చింది.
Thu, Jun 27, 2019, 12:02 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View