'మహర్షి' 50 రోజుల వేడుక వాయిదా
Advertisement
మహేశ్ బాబు 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారం చేసింది. నిర్మాతలకి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అత్యధిక కేంద్రాల్లో ఈ సినిమా ఈ రోజుతో 50 రోజులను పూర్తి చేసుకోనుంది. దాంతో రేపు సాయంత్రం హైదరాబాద్ - శిల్పకళావేదికలో 50 రోజుల వేడుక నిర్వహించడానికి సన్నాహాలు చేశారు.

అయితే నటుడు కృష్ణ భార్య విజయనిర్మల బుధవారం రాత్రి చనిపోవడంతో, ఆ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ కారణంగా 'మహర్షి' 50 రోజుల వేడుక కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారనేది త్వరలో తెలియజేయనున్నారు.  
Thu, Jun 27, 2019, 11:15 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View