బన్నీ సినిమా కోసం తమన్ దుమ్ము రేపేశాడట
Advertisement
అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు.

డాన్స్ లో అల్లు అర్జున్ స్పీడ్ ను .. ఆయన నుంచి అభిమానులు ఆశించే స్టెప్స్ ను దృష్టిలో పెట్టుకుని తమన్ హుషారైన బాణీలను సమకూర్చాడట. ఈ బాణీలు మాస్ ఆడియన్స్ కి మరింతగా నచ్చేస్తాయని అంటున్నారు. ఇంతవరకూ తనకి మంచి పేరు తెచ్చిపెట్టిన ఆల్బమ్స్ జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోతుందని తమన్ చెబుతున్నాడట. ఇక అల్లు అర్జున్ కూడా ఈ సినిమాకి సాంగ్స్ హైలైట్ గా నిలుస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడట. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలోనే ఉద్దేశంతో, ఆ దిశగానే పనులు కానిస్తున్నారు. 
Thu, Jun 27, 2019, 10:24 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View