కృష్ణమ్మను చేరేందుకు గోదావరి ఉరుకులు!
Advertisement
పోలవరం సమీపంలోని పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి గోదావరి పరుగులు పెడుతూ వస్తోంది. కృష్ణానదికి గోదావరి నీళ్లు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తున్న రైతులకు చల్లని కబురు చెబుతూ, వరుసగా ఐదో సంవత్సరం గోదావరి నీరు కృష్ణమ్మను తాకనుంది. బుధవారం నాడు పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులో ఉన్న 24 మోటార్లలో మూడింటిని ఆన్ చేశారు. నేడు మరో రెండు పంప్ లను ఆన్ చేయనున్నామని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ నీరు కృష్ణానదిలోకి చేరడానికి నాలుగు రోజుల సమయం పడుతుందని అధికారులు అంటున్నారు.

 గత సంవత్సరం ప్రకాశం బ్యారేజ్‌ నుంచి జూన్‌ 20వ తేదీన తూర్పు డెల్టాకు గోదావరి నీటిని విడుదల చేశారు. ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యం కావడంతో రైతులకు నీటి విడుదల కూడా ఆలస్యం కానుంది. ప్రస్తుతం గోదావరిలో 3 వేల క్యూసెక్కుల నీరుండగా, దాన్ని కృష్ణానదికి చేర్చనున్నారు. ఎగువన వర్షాలు పెద్దగా లేక, గోదావరిలోకి నీరు రాకపోవడంతో ఈ సంవత్సరం నీటిని ఎత్తిపోయడంలో జాప్యం జరిగింది.
Thu, Jun 27, 2019, 08:36 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View