సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  'నేను వైద్య వృత్తిని మాత్రం వదులుకునేది లేదు' అంటోంది కథానాయిక సాయిపల్లవి. ఎంబీబీఎస్ చదివి సినిమాల్లోకి వచ్చిన సాయిపల్లవి ఈ విషయంపై మాట్లాడుతూ, 'అవకాశాలు వచ్చినంత కాలం సినిమాల్లో నటిస్తాను. తర్వాత ఇక నా డాక్టర్ వృత్తిలో స్థిరపడతాను. డాక్టర్ కావాలని కలలుకని మరీ అయ్యాను. అందుకని భవిష్యత్తులో వైద్య వృత్తిలోనే స్థిరపడతాను' అని చెప్పింది.
*  ఆది సాయికుమార్ హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన 'బుర్రకథ' చిత్రం విడుదల ఒకరోజు వాయిదా పడింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయాల్సివుండగా, ఒకరోజు ఆలస్యంగా అంటే 29న విడుదల చేస్తున్నారు.
*  'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' హిట్టవడంతో ఆ చిత్రంలో కథానాయికగా నటించిన కైరా అద్వానీకి బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడింది. దీంతో అమ్మడు పారితోషికాన్ని అమాంతం పెంచేసి, డబుల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు కైరాకు కోటి లోపులోనే పారితోషికాన్ని చెల్లించారు.
Thu, Jun 27, 2019, 07:13 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View