ఇది డిఫరెంట్ మూవీ .. హిట్ కొట్టడం ఖాయం: ఆది సాయికుమార్
Advertisement
ఆది సాయికుమార్ కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో 'బుర్రకథ' తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో డైమండ్ రత్నబాబుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారి తొలిసారిగా ఈ సినిమా చేశాడు. మిస్తీ చక్రవర్తి నాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ .. "ఇది రెండు బుర్రల కథ .. ద్విపాత్రాభినయం కాదు .. హీరో ఒకడే .. కాకపోతే ఇద్దరిగా కనిపిస్తాడు" అని చెప్పాడు. "డైమండ్ రత్నబాబుగారు కథ చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్ గా .. డిఫరెంట్ గా అనిపించింది. ఒకే మనిషిలో రెండు బ్రెయిన్స్ ఉంటాయి. ఒకటి ఒకలా .. ఇంకొకటి మరొకలా ఆలోచిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది కథ. వైవిధ్యభరితమైన ఈ కథ ఆడియన్స్ కి నచ్చుతుందనీ .. హిట్ కొడుతుందని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Wed, Jun 26, 2019, 05:52 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View