తాతగా సత్యరాజ్ .. తండ్రిగా రావు రమేశ్ .. కొడుకుగా సాయిధరమ్ తేజ్
Advertisement
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఇటీవలే ఒక సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నాను తీసుకున్నారు. గీతా ఆర్ట్స్ 2 - యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగుతుంది.

ఇది మూడు తరాలకి .. ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన కథ అని అంటున్నారు. తాత .. తండ్రి .. కొడుకు చుట్టూ ఈ కథ తిరుగుతుందని చెబుతున్నారు. తాత పాత్రలో సత్యరాజ్ .. తండ్రి పాత్రలో రావు రమేశ్ .. కొడుకు పాత్రలో సాయిధరమ్ తేజ్ కనిపించనున్నారు. ఈ మూడు పాత్రలను చాలా భిన్నంగా .. బలంగా తీర్చిదిద్దినట్టుగా సమాచారం. కామెడీతో పాటు ఎమోషన్ కి పెద్దపీట వేసిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో వున్నారు.
Wed, Jun 26, 2019, 05:31 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View