బన్నీ సినిమా విడుదల కోసం పరిశీలనలో రెండు తేదీలు
Advertisement
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ఏ తేదీ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో గట్టి కసరత్తునే చేశారట.

సెంటిమెంట్ ప్రకారం జనవరి 9 - 10 తేదీలలో విడుదల వద్దని అనుకున్నట్టుగా సమాచారం. జనవరి 11వ తేదీనీ 13వ తేదీని పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ రెండు తీదీలలో ఒక తేదీని త్వరలోనే ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ తేదీలకి ఒక రోజు ముందుగానీ .. ఒకరోజు  తరువాతగాని మహేశ్ బాబు సినిమా ఉండనుంది. ఇక బాలకృష్ణ కూడా సంక్రాంతికి రంగంలోకి దిగే పనిలో వున్నాడు. ఈ సారి సంక్రాంతికి సందడే సందడన్న మాట. 
Wed, Jun 26, 2019, 04:46 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View