100 కోట్ల క్లబ్ లోకి చేరిన 'కబీర్ సింగ్'
Advertisement
'అర్జున్ రెడ్డి'తో దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా తెలుగులో సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ఈ సినిమా ఇక్కడ భారీ వసూళ్లను రాబట్టడంతో, షాహిద్ కపూర్ - కైరా అద్వాని జంటగా హిందీలో రీమేక్ చేశాడు. 'కబీర్ సింగ్' టైటిల్ తో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తొలి రోజునే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, అయిదు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. షాహిద్ కపూర్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఇది నిలిచిందని చెబుతున్నారు. 3,123 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా, ఈ ఏడాదిలో ఇంతవరకూ అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల జాబితాలో 4వ స్థానంలో నిలిచిందని అంటున్నారు. సందీప్ వంగాతో మరో సినిమా చేసే ఆలోచలో షాహిద్ కపూర్ ఉన్నాడనేది బాలీవుడ్ టాక్.
Wed, Jun 26, 2019, 04:25 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View