'ఓ బేబీ' క్లైమాక్స్ లో నిజంగానే ఏడ్చేశాను: సమంత
Advertisement
సమంత ప్రధాన పాత్రధారిగా నందినీరెడ్డి దర్శకత్వంలో 'ఓ బేబీ' నిర్మితమైంది. వచ్చేనెల 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, మొదటి నుంచి కూడా ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు సహజంగానే కళ్లవెంట నీళ్ళొచ్చేస్తాయి. అందువలన నేను గ్లిజరిన్ వాడను.

అదే విధంగా 'ఓ బేబీ' సినిమా క్లైమాక్స్ సీన్ లోను గ్లిజరిన్ లేకుండానే ఏడ్చేశాను. అది ఎమోషనల్ సీన్ .. ఆ సీన్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ తట్టుకోలేక రెండు గంటలపాటు బ్రేక్ కూడా తీసుకున్నాను. నేను నిజంగానే ఏడ్చేశాననే విషయం స్క్రీన్ పై తెలిసిపోతుంది. నిజానికి ఈ సినిమాలో నేను చేసింది చాలా విభిన్నమైన పాత్ర .. నా కెరియర్లో ఇంతవరకూ చేయని పాత్ర. ఇది అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చారు.
Wed, Jun 26, 2019, 04:00 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View