రాధిక మా ఆయనని కొట్టింది: సీనియర్ హీరోయిన్ నళిని
Advertisement
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో నిన్నటితరం కథానాయికగా నళిని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ రాధిక గురించి ప్రస్తావించారు.

"చిత్రపరిశ్రమలో నాకున్న ఆత్మీయుల్లో రాధిక ఒకరు. మేమిద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించాము. నా కష్ట నష్టాల్లో రాధిక నాకు అండగా నిలిచింది. నా భర్తకి .. నాకు మధ్య మనస్పర్థలు తలెత్తగా .. విడిపోవాలనే నిర్ణయానికి వచ్చేశాము. ఆ సమయంలో రాధిక నేరుగా వెళ్లి మా ఆయనని కొట్టింది. 'నళిని  గురించి నీకేం తెలుసు .. ఆమె చిన్నపిల్లతో సమానం. వెళ్లిపోతే వెళ్లిపో .. నళినీని ఆమె పిల్లలను నేను చూసుకుంటాను. వాళ్లను నేను పోషిస్తాను" అంటూ మా ఆయనతో గట్టిగా చెప్పేసి వచ్చింది. అలా నన్ను అర్థం చేసుకునే ఆత్మీయురాలు దొరకడం నా అదృష్టం" అని చెప్పుకొచ్చారు.
Wed, Jun 26, 2019, 02:52 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View