ఆ పాత్రలు గొప్పవని ఎన్టీఆర్ అనేవారు: సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి
Advertisement
తాజా ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మాట్లాడుతూ, ఎన్టీఆర్ తో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. "ఎన్టీఆర్ తో నాకు మంచి అనుబంధం వుండేది. నేను నేరుగా ఆయన ఇంటికే వెళ్లేవాడిని. ఎన్టీఆర్ టైమింగ్స్ తెలుసు గనుక ఉదయాన్నే ఆయన ఇంటికి వెళ్లేవాడిని. ఆ సమయంలో ఆయన తన సినిమాలకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తూ ఉండేవారు.

రావణాసురుడు .. దుర్యోధనుడు .. కర్ణుడు వంటి నెగెటివ్ పాత్రలను సైతం ఆయన చేయడం గురించి అడిగేవాడిని. అప్పుడాయన ఆ పాత్రల గొప్పతనం గురించి నాకు చెప్పేవారు. ఆయా పాత్రల్లో గుణ సంబంధమైన దోషాలు ఎలా ఉన్నాయో .. మంచి గుణాలు కూడా కొన్ని ఉన్నాయని అనేవారు. అంతలా ఆయా పాత్రల పట్ల ఆయనకి అవగాహన ఉండేది" అని చెప్పుకొచ్చారు.
Wed, Jun 26, 2019, 02:25 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View