చిరంజీవిగారితో డాన్స్ అంటే టెన్షన్ పడేదాన్ని: సీనియర్ హీరోయిన్ నళిని
Advertisement
తాజా ఇంటర్వ్యూలో సీనియర్ హీరోయిన్ నళిని మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. "నా సినిమాలకి సంబంధించిన అన్ని విషయాలను మా అమ్మగారే చూసుకునేది. ఒక్క నిమిషం కూడా ఆమె టైమ్ వేస్ట్ చేయనిచ్చేది కాదు. రెండు గంటలకి ఒక షూటింగు చొప్పున ఒక రోజుకి 5 సినిమాల షూటింగులు చేయించేసేది.

అలాంటి పరిస్థితుల్లోనే చిరంజీవిగారితో కలిసి 'ఇంటిగుట్టు' చేయవలసి వచ్చింది. చిరంజీవిగారు డాన్స్ విషయంలో ఎంతటి శ్రద్ధ పెడతారో తెలిసిందే. పెర్ఫెక్షన్ కోసం ఆయన ఒకటికి పదిసార్లు రిహార్సల్స్ చేసేవారు. నాతోను అలా చేయిస్తారేమోనని చాలా టెన్షన్ పడేదాన్ని. ఆయనతో డాన్స్ అంటే అంత ఆషామాషీ కాదు. చేయగలుగుతానో లేదో అని ఒక పక్క .. మరో షూటింగుకి అందుకుంటానో లేదోనని మరో పక్క చాలా టెన్షన్ పడేదాన్ని" అని చెప్పుకొచ్చారు.
Wed, Jun 26, 2019, 01:58 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View