హెరిటేజ్ మిల్క్ శంకుస్థాపన.. చంద్రబాబు-మోహన్ బాబు కలిసిఉన్న ఫొటోను పోస్ట్ చేసిన మంచు లక్ష్మి!
Advertisement
ప్రముఖ నటి మంచు లక్ష్మి ఈరోజు ఓ ఆసక్తికర ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో తన తండ్రి మోహన్ బాబు కలిసి దిగిన ఫొటోను ఆమె ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు. ‘వీరిద్దరి(మోహన్ బాబు, చంద్రబాబు) భాగస్వామ్యంలో హెరిటేజ్ మిల్క్ సంస్థకు చెందిన ఓ ఔట్ లెట్ కు భూమిపూజ చేస్తున్న ఫొటో ఇది. నిజంగా అవి అద్భుతమైన రోజులు. కాలం క్రమంగా మారిపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. కూల్ గా కనిపించే టోపీ, కళ్లద్దాలతో అదరగొట్టేశారు నాన్న’ అని మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. అయితే ఈ ఫొటోను ఎప్పుడు, ఎక్కడ తీశారన్న విషయమై మంచు లక్ష్మి స్పష్టత ఇవ్వలేదు.
Wed, Jun 26, 2019, 12:04 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View