'బిగ్ బాస్ 3'పై స్పందించిన యాంకర్ లాస్య
Advertisement
బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న యాంకర్స్ లో 'లాస్య' పేరు కూడా ముందు వరుసలోనే కనిపిస్తుంది. ఈ మధ్యనే వివాహం చేసుకుని .. ఇటీవల ఆమె ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. అలాంటి లాస్య 'బిగ్ బాస్ 3' కోసం ఎంపిక అయిందనీ, ఈ షోలో పాల్గొంటున్నందుకు ఆమెకి 30 లక్షల వరకూ ముడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై లాస్య స్పందిస్తూ .. 'బిగ్ బాస్ 3' కోసం నా ఎంపిక జరిగిపోయిందనే ప్రచారం కారణంగా, సన్నిహితులంతా నాకు కాల్ చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. కానీ ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. నాకు రెండున్నర నెలల బాబు వున్నాడు. అందువలన ఈసారికి 'బిగ్ బాస్' చేసే ఆలోచనలేదు. మరెప్పుడైనా అవకాశం వస్తే అప్పుడు చూద్దాం' అంటూ చెప్పుకొచ్చింది. ఈ షోకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారనే సంగతి తెలిసిందే.
Wed, Jun 26, 2019, 10:19 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View