కళ్లుచెదిరే యార్కర్ తో స్టోక్స్ ను బౌల్డ్ చేసిన స్టార్క్... ఓటమి దిశగా ఇంగ్లాండ్
Advertisement
లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం దిశగా పయనిస్తోంది. ధాటిగా ఆడుతున్న ఇంగ్లీష్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను మిచెల్ స్టార్క్ ఓ తిరుగులేని యార్కర్ తో బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ఆసీస్ వైపు మొగ్గింది. అప్పటివరకు స్టోక్స్ దూకుడు చవిచూసిన ఆసీస్ అతడు అవుట్ కావడంతో ఊపిరిపీల్చుకున్నారు. స్టోక్స్ 89 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 285 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 38 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. క్రీజులో మొయిన్ ఆలీ, క్రిస్ వోక్స్ ఉన్నారు. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే 12 ఓవర్లలో 103 పరుగులు చేయాలి.
Tue, Jun 25, 2019, 10:04 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View