ఆరోగ్య పరిరక్షణలో ఏపీ రెండోస్థానంలో నిలవడం చంద్రబాబు పాలనకు నిదర్శనం: నారా లోకేశ్
Advertisement
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎంతగానో కృషి చేశారని మాజీ మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. నీతి ఆయోగ్ ఆరోగ్య నివేదిక ప్రకారం ఏపీ 2015-17 మధ్యకాలంలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని లోకేశ్ వెల్లడించారు. 23 ఆరోగ్య సూచికలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందిస్తారని, అలాంటి జాబితాలో ఏపీ ద్వితీయస్థానం దక్కించుకోవడం చంద్రబాబు అవిశ్రాంత కృషి ఫలితమేనని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజారోగ్యం మెరుగుపరిచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు.
Tue, Jun 25, 2019, 09:09 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View