ఆసుపత్రి నిర్వాకం.. కొడుకు మృతదేహాన్ని భుజంపై వేసుకుని వెళ్లిన తండ్రి!
Advertisement
Advertisement
ఆమధ్య ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని కొన్ని కిలో మీటర్ల దూరం ప్రయాణించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇలాంటిదే మరో ఘటన బీహార్‌లోని నలందలో జరిగింది. కడుపునొప్పి, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన 8 ఏళ్ల కుమారుడిని ఓ వ్యక్తి నలందలోని సదర్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ ఆ చిన్నారి నేడు చనిపోయాడు.

ఆ బాలుడి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ అందుబాటులో లేదని ఆసుపత్రి సిబ్బంది చెప్పింది. దీంతో ప్రైవేటు వాహనంలో తరలించే స్తోమత లేక కొండంత బాధతో తన కుమారుడి మృతదేహాన్ని భుజాన వేసుకుని ఇంటికి బయల్దేరాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ యోగేంద్ర సింగ్ దీనిపై విచారణ జరిపిస్తామని, సిబ్బంది తప్పుందని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  
Tue, Jun 25, 2019, 09:00 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View