టీడీపీని వీడిన నందమూరి బాలకృష్ణ బంధువు.. బీజేపీ కండువా కప్పిన పురందేశ్వరి!
టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు బంధువు అయిన పొట్లూరి కృష్ణబాబు ఆ పార్టీని వీడారు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. పొట్లూరి కృష్ణబాబు దంపతులు ఈరోజు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో వాళ్లిద్దరూ భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీలోకి వారిని సాదరంగా ఆహ్వానించిన పురందేశ్వరి వారికి అభినందనలు తెలిపారు.
Tue, Jun 25, 2019, 08:49 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View