నిండు గర్భిణి పట్ల నిర్లక్ష్యం.. ఆసుపత్రి బాత్రూంలో ప్రసవం
పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణి పట్ల వైద్యులు సహా నర్సు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో గర్భిణి ఆసుపత్రి బాత్రూంలోనే ప్రసవించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. షామిలి అనే నిండు గర్భిణి ప్రసవం కోసం స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అక్కడ ఉన్న సీనియర్ వైద్యులు, పెద్దాసుపత్రికి వెళ్లమని ఉచిత సలహా ఇచ్చేసి ఊరుకున్నారు.

పురుటి నొప్పులతో బాధ పడుతున్న షామిలీ సాయం కోసం ఏంజిలీనా అనే నర్సును అభ్యర్థించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో షామిలీ ఆసుపత్రి బాత్రూమ్‌లోనే ప్రసవించింది. గత నెల 27న జరిగిన ఈ ఘటన షామిలి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో వెలుగు చూసింది. ఉన్నతాధికారులు నిర్వహించిన అంతర్గత దర్యాప్తులో ఘటన నిజమేనని తేలింది. దీంతో ఏంజిలీనాపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం సీనియర్ వైద్యులకు మరోసారి ఇలా జరిగితే సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేసింది.
Tue, Jun 25, 2019, 08:14 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View