అమలా పాల్ ప్లేస్ లో మేఘా ఆకాశ్
Advertisement
తెలుగులో తొలి రెండు సినిమాలు భారీ పరాజయాలను చవిచూడటంతో, సహజంగానే మేఘా ఆకాశ్ కి అవకాశాలు లేకుండా పోయాయి. అయితే ఇప్పుడిప్పుడే ఆ పరాజయాల ప్రభావం తొలగిపోతూ అవకాశాలు ఆమెను పలకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళంలోను నిలదొక్కుకోవడానికి మేఘా ఆకాశ్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

ఆమె ప్రయత్నాలు ఫలించి, విజయ్ సేతుపతి సరసన ఛాన్స్ లభించిందని తెలుస్తోంది. విజయ్ సేతుపతి తన 33వ సినిమాతో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. వెంకటకృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో, ముందుగా అమలా పాల్ ను తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకోవడంతో, మేఘా ఆకాశ్ ను తీసుకున్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 
Tue, Jun 25, 2019, 05:04 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View