'కల్కి' విడుదలకి రంగం సిద్ధం
Advertisement
రాజశేఖర్ తాజా చిత్రంగా 'కల్కి' నిర్మితమైంది. ఆదాశర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. దాంతో అన్ని ప్రాంతాల్లోను ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధమైపోయింది.

గతంలో పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్ చేసిన చాలా సినిమాలు ఆయనకి విజయాలనే తెచ్చిపెట్టాయి. ఆ సెంటిమెంట్ కారణంగా ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
Tue, Jun 25, 2019, 04:48 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View