భారీ చారిత్రక చిత్రంలో 'ప్రేమమ్' హీరోయిన్
Advertisement
మలయాళం 'ప్రేమమ్' చిత్రంలో ఒక కథానాయికగా చేసిన మడోన్నా సెబాస్టియన్ కి మంచి క్రేజ్ వచ్చింది. అప్పటి నుంచి అక్కడ ఆమె తన జోరు చూపిస్తూనే వస్తోంది. తాజాగా ఆమె మణిరత్నం సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. 'పొన్నియన్ సెల్వన్' టైటిల్ తో చోళరాజుల కథను మణిరత్నం రూపొందించనున్నారు.

భారీ చారిత్రక చిత్రం కావడంతో, ఈ సినిమాలో వివిధ భాషలకి చెందిన నటీనటులను తీసుకోనున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మణిరత్నంను మడోన్నా కలుసుకుంది. తనకి చాలా సంతోషంగా ఉందంటూ, ఆయనతో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఈ సినిమాలో ఆమెకి ఛాన్స్ లభించిందని కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన పనుల్లోనే మణిరత్నం బిజీగా వున్నారు. 
Tue, Jun 25, 2019, 03:39 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View