'రుద్రాక్ష'పై స్పందించిన కృష్ణవంశీ
Advertisement
వినోదంతో పాటు సందేశం ఉండేలా కృష్ణవంశీ చాలా సినిమాలను తెరకెక్కించాడు. గ్రామీణ నేపథ్యంలో ఆయన రూపొందించిన సినిమాలను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి కృష్ణవంశీ నుంచి కొంతకాలంగా సినిమా లేదు. ఈ నేపథ్యంలోనే గతంలో తాను సిద్ధం చేసుకున్న 'రుద్రాక్ష' స్క్రిప్ట్ తో ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు చెప్పుకుంటున్నారు.

తాజాగా ఈ విషయంపై కృష్ణవంశీ స్పందించారు. 'రుద్రాక్ష' అనే టైటిల్ తో నేను సినిమా చేయనున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. నేను ఏ సినిమా అయినా మొదలుపెడితే అధికారికంగా అందరికీ తెలియజేస్తాను. అప్పటివరకూ ఎలాంటి పుకార్లను నమ్మొద్దు" అని ఆయన స్పష్టం చేశారు. 
Tue, Jun 25, 2019, 03:02 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View