భారతీరాజా ఇంటిముందు తిరిగేవాడిని: జేడీ చక్రవర్తి
- చిరంజీవిగారంటే నాకు చాలా ఇష్టం
- ఆయన ఇంటిముందు నుంచునేవాడిని
- భారతీరాజా బయటకు రాలేదన్న జేడీ
Advertisement
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. "చిరంజీవిగారంటే నాకు చాలా ఇష్టం .. ఆయనకి నేను అతిపెద్ద అభిమానిని. అప్పట్లో చెన్నైలోని చిరంజీవిగారి ఇంటి దగ్గర ప్రతి రోజు కాసేపు నుంచునేవాడిని. అలా చేయడం వలన ఆయన అదృష్టంలో పది శాతమైనా నాకు రాకపోతుందా అనుకునేవాడిని.
అక్కడి నుంచి దర్శకుడు భారతీరాజా ఇంటి దగ్గరికి వెళ్లేవాడిని. ఆయన ఇంటిముందు అటూ ఇటూ తిరిగేవాడిని. భారతీరాజా కార్లో వెళుతూ తనకి ఎదురుపడిన కుర్రాళ్లలో కొంతమందిని హీరోలుగా చేసినట్టు చెప్పుకుంటారు. అలా నన్ను చూడకపోతారా అని అలా ఆయన ఇంటిముందే తిరిగేవాడిని. నా దురదృష్టం కొద్దీ నేను చూసినప్పుడు ఎప్పుడూ ఆయన కార్లో బయటికి రాలేదు" అంటూ జేడీ చక్రవర్తి నవ్వేశారు

Tue, Jun 25, 2019, 02:25 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com