'మహర్షి' 50 రోజుల వేడుక .. ముఖ్య అతిథిగా నాని
Advertisement
మహేశ్ బాబు కథానాయకుడిగా .. ఆయన 25వ సినిమాగా 'మహర్షి' తెరకెక్కింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, కథానాయికగా పూజ హెగ్డే నటించింది. మే 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేస్తూ, ఈ నెల 27వ తేదీతో 50 రోజులను పూర్తి చేసుకోనుంది.

200 కేంద్రాల్లో ఈ సినిమా అర్ధశతదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉండటం విశేషం. ఈ నెల 28వ తేదీన ఈ వేడుకను హైదరాబాద్ - శిల్పకళా వేదికలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా నానీని ఆహ్వానించినట్టుగా సమాచారం. అడిగిన వెంటనే నాని అంగీకరించాడట. ఇటు మహేశ్ అభిమానులకు .. అటు నాని ఫ్యాన్స్ కి ఈ నెల 28వ తేదీ పండుగ రోజేనన్నమాట. 
Tue, Jun 25, 2019, 12:09 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View