'శివ' సినిమా షూటింగు తొలి రోజునే నాగార్జున నన్ను కొట్టారు: జేడీ చక్రవర్తి
Advertisement
'శివ' సినిమాతో తెలుగు తెరకి జేడీ చక్రవర్తి పరిచయమయ్యారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన ఆ సినిమాను గురించి ప్రస్తావించారు. 'శివ' సినిమా కోసం ఇరానీ కేఫ్ లో నాకు .. నాగార్జునగారికి ఫైట్ సీన్ ప్లాన్ చేశారు. ఆ విషయం తెలిసి చాలామంది జనాలు అక్కడికి వచ్చేశారు.

మధ్యాహ్నం తరువాత సీన్ అన్నారు. నేను ఇరానీ కేఫ్ నుంచి బయటికి వెళుతున్నాను .. నాగార్జునగారు లోపలికి వస్తున్నారు. నేను ఆయనను చూసుకోలేదు .. నా భుజం ఆయనకి తగిలింది. 'ఏయ్ ఎటుచూసి నడుస్తున్నావ్?' అన్నారు. 'లేదండీ నేను చూడలేదు' అన్నాను. 'ఏంటి తగిలితే సారీ చెప్పాలని కూడా నీకు తెలియదా? పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్?' అన్నారు.

'సార్ .. మీరు మర్యాదగా మాట్లాడండి' అన్నాను నేను. 'ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్?' అంటూ లాగిపెట్టి కొట్టారు. కిందపడిపోయిన నేను లేచి ఆయన కాలర్ పట్టుకున్నాను. నాగ్ మనుషులు నన్ను కొట్టడానికి వస్తుంటే ఆయన వాళ్లను ఆపేసి .. అది షూటింగ్ అని చెప్పారు. రియలిస్టిక్ గా ఉండాలనే ఉద్దేశంతో వర్మ అలా ప్లాన్ చేశారు. ఆ విషయం నాకు .. నాగార్జున గారికి మరో నలుగురైదుగురికి తప్ప ఎవరికీ తెలియదు" అని చెప్పుకొచ్చారు.
Tue, Jun 25, 2019, 11:46 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View