ఉత్కంఠను రేపుతోన్న 'కల్కి' ట్రైలర్
Advertisement
రాజశేఖర్ కథానాయకుడిగా .. సి.కల్యాణ్ నిర్మాతగా 'కల్కి' చిత్రం నిర్మితమైంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. సస్పెన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

'కొల్లాపూర్' ప్రాంతంలో జరిగే అరాచకాలు .. వాటిని అరికట్టడానికి హీరోగా 'కల్కి' రంగంలోకి దిగడాన్ని ఈ ట్రైలర్లో చూపించారు. 'హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు .. యుద్ధం చేయవలసింది రాముడే' అనే డైలాగ్ బాగుంది. ఈ ట్రైలర్ ద్వారా సినిమాపై మరింత ఆసక్తిని పెంచడానికి టీమ్ చేసిన ప్రయత్నం ఫలిస్తుందనే చెప్పాలి. రాజశేఖర్ సరసన ఆదా శర్మ నటించిన ఈ సినిమా, తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో అభిమానులు వున్నారు.
Tue, Jun 25, 2019, 11:18 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View