వర్మను తొలిసారిగా అక్కడ చూశాను: జేడీ చక్రవర్తి
Advertisement
తెలుగు తెరపై నిన్నటితరం హీరోగా జేడీ చక్రవర్తికి మంచి పేరుంది. అవకాశాలు తగ్గిన తరువాత మెగాఫోన్ పట్టిన ఆయనకి అంతగా విజయాలు లభించలేదు. దాంతో తిరిగి నటన వైపుకు వచ్చేసి, కేరక్టర్ ఆరిస్ట్ గా బిజీ అయ్యారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి చెప్పుకొచ్చారు.

"మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని అనుకుంటూ ఉండేవాడిని. కాకపోతే ఎక్కడికి వెళ్లాలో .. ఎవరిని కలవాలో నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నా స్నేహితుడు ఉత్తేజ్ నన్ను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోకి రమ్మని కబురు చేశాడు. నేను వెళ్లి ఉత్తేజ్ కోసం వెయిట్ చేస్తుంటే, ఒక వ్యక్తి ఆ రూమ్ లోకి వచ్చాడు. ఏదైనా ఒక సీన్ అనుకుని చేసి చూపించమన్నాడు. 'సీన్ ఇవ్వండి చేస్తాను' అన్నాను. అంతలో ఉత్తేజ్ వచ్చి .. ఆయనే రామ్ గోపాల్ వర్మ అని నాకు చెప్పాడు. అలా వర్మను తొలిసారిగా అక్కడ చూశాను" అని చెప్పుకొచ్చారు. 
Tue, Jun 25, 2019, 10:42 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View