రాంగ్ రూటులో బీజేపీ నేత కారు.. ఆపమన్న హోంగార్డును ఢీకొట్టి బానెట్‌పై ఈడ్చుకెళ్లిన వైనం!
Advertisement
రాంగ్ రూటులో వెళ్తున్న బీజేపీ నేత కారును ఆపిన పాపానికి ఓ హోంగార్డుపై sadaru neta చేయి చేసుకున్నాడు. అక్కడితో ఆగక కారుకు అడ్డంగా ఉన్న అతడిని ఢీకొట్టి, బానెట్‌పై ఉండగానే కారును పోనిచ్చాడు. హరియాణాలోని రేవారిలో జరిగిందీ ఘటన. బీజేపీ నేత అయిన సతీశ్ ఖోడా ప్రయాణిస్తున్న కారు సోమవారం రాంగ్ రూట్‌లోకి ఎంటరైంది. గమనించిన హోంగార్డు కారును ఆపాలని సూచించాడు.

కారులో ఉన్న ఖోడా అతడిని పిలిచి చెంపలు చెళ్లుమనిపించాడు. ఆ వెంటనే అతడిని గుద్దుకుంటూనే డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు. కారు బానెట్‌పై గార్డు చిక్కుకుపోయాడు. దాదాపు 300 మీటర్లు వెళ్లిన తర్వాత కారును ఆపడంతో గార్డు బతుకు జీవుడా అనుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు.  

కారు రాంగ్ రూట్‌లో వెళ్తోందని చెప్పి ఆపడంతో, తనపై ఇద్దరూ దాడి చేశారని హోంగార్డు మోను సింగ్ తెలిపాడు. ఈ ఘటనపై ఖోడా కారు డ్రైవర్ మాట్లాడుతూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తప్పు తనదేనని అంగీకరించాడు. కారును రాంగ్ రూట్‌లోకి తీసుకెళ్లానని, ఆపమన్న హోంగార్డును బతిమాలానని పేర్కొన్నాడు. అయినప్పటికీ ఆయన వినకపోవడంతో కారును ముందుకు కదిలించానని, ఈ క్రమంలో అతడు బానెట్‌కు చిక్కుకున్నాడని డ్రైవర్ సోను తెలిపాడు. తన తప్పును అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నాడు. అయితే, తర్వాత ఏమైందన్నది తెలియరాలేదు.
Tue, Jun 25, 2019, 10:11 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View