సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  'సీత' చిత్రాన్ని థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో చూడచ్చని అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. ఈమేరకు అమ్మడు తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కాజల్ నటనకు మంచి పేరును తెచ్చినప్పటికీ, బాక్సాఫీసు వద్ద మాత్రం ఫెయిల్ అయిన సంగతి విదితమే.
*  చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం సైరా షూటింగ్ మొత్తం నిన్నటితో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న భారీ ఎత్తున రిలీజ్ చేస్తారు.
*  మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందే 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రానికి ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే బిజినెస్ వర్గాలలో క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జెమిని టీవీ భారీ రేటు ఆఫర్ చేసి సొంతం చేసుకున్నట్టు సమాచారం.
Tue, Jun 25, 2019, 07:15 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View