షకీబల్ స్పిన్ మాయాజాలంలో చిక్కి ఆఫ్ఘన్లు విలవిల
Advertisement
సౌతాంప్టన్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ తన స్పిన్ తో ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్ మన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. 263 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు షకీబల్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుంది. షకీబల్ 7 ఓవర్లు బౌల్ చేసి కేవలం 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. షకీబల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం విశేషం. 47 పరుగులు చేసిన కెప్టెన్ గుల్బదిన్ నయిబ్ సహా అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్ అందరూ షకీబల్ బౌలింగ్ లోనే వెనుదిరిగారు. మందకొడిగా మారిన పిచ్ పై స్పిన్ ను ఎదుర్కోవడంలో ఆఫ్ఘన్లు తడబాటుకు గురవుతున్నారు. ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్థాన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 15 ఓవర్లలో 131 పరుగులు చేయాలి. చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి.
Mon, Jun 24, 2019, 09:44 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View