బెరం పార్కులో అధికారులకు ప్రభుత్వ విందు... సతీసమేతంగా పాల్గొన్న సీఎం జగన్
Advertisement
ఏపీ సీఎం జగన్ ఇవాళ జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నవరత్నాల అమలే ప్రధాన అజెండాగా సాగిన ఈ సమావేశంలో జగన్ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం విజయవాడలోని బెరం పార్కులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు ప్రభుత్వం తరఫున విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో సీఎం జగన్ సతీసమేతంగా పాల్గొన్నారు. రాష్ట్ర యంత్రాంగంలో భాగంగా ఉన్న ఆ అధికార గణంతో జగన్ ఉల్లాసంగా గడిపారు. విందు అనంతరం జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు.
Mon, Jun 24, 2019, 09:34 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View