‘రాములమ్మ’ బర్త్ డే.. సూపర్‌స్టార్ మహేశ్ ఆసక్తికర పోస్ట్
Advertisement
కాంగ్రెస్ మహిళా నేత, అలనాటి నటి విజయశాంతి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా.. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. విజయశాంతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.

ఆమెతో కలిసి మరోసారి పనిచేయడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆమెకు చాలా బాగుండాలని, ఆమె అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నానని మహేశ్ ట్వీట్ చేశాడు. విజయశాంతి నటించిన ‘కొడుకు దిద్దిన కాపురం’ (1989) సినిమాలో మహేశ్‌ బాలనటుడిగా కనిపించాడు. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంలో మహేశ్, విజయశాంతి స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
Mon, Jun 24, 2019, 08:44 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View