నిషేధిత ప్రాంతంలో సిగరెట్ తాగినందుకు హీరో రామ్ కు ఫైన్
Advertisement
టాలీవుడ్ హీరో రామ్ కు హైదరాబాద్ పోలీసులు ఫైన్ విధించారు. వివరాల్లోకి వెళ్తే, పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్లో 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లను చార్మినార్ వద్ద చిత్రీకరించారు. ఇందులో భాగంగా రామ్ సిగరెట్ తాగే సన్నివేశాన్ని షూట్ చేశారు. అయితే, చార్మినార్ పర్యాటక ప్రాంతం కావడంతో... అక్కడ ధూమపానం నిషేధం. ఈ విషయం తెలియక రామ్ అక్కడ సిగరెట్ కాల్చాడు. ఈ ఘటనను ఫొటో తీసిన పోలీసులు... రూ. 200 జరిమానా విధించారు. కోప్టా యాక్ట్ 2003 సెక్షన్ 4 ప్రకారం ఫైన్ వేశారు. ఈ మొత్తాన్ని రామ్ కట్టేశాడు.
Mon, Jun 24, 2019, 06:32 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View