వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోన్న 'కబీర్ సింగ్'
Advertisement
తెలుగులో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఈ సినిమాను ఆయన 'కబీర్ సింగ్' పేరుతో హిందీలో రీమేక్ చేశాడు. షాహిద్ కపూర్ - కైరా అద్వాని జంటగా నటించిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన థియేటర్లకు వచ్చింది.

విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. దేశవ్యాప్తంగా తొలి రోజున ఈ సినిమా 20 కోట్లను .. రెండవ రోజున 22 కోట్లను .. మూడో రోజున 28 కోట్లను వసూలు చేసింది. ఇలా ఈ సినిమా తొలి 3 రోజుల్లో 70 కోట్లను రాబట్టినట్టుగా ట్రేడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. తెలుగులో మాదిరిగానే హిందీలోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Mon, Jun 24, 2019, 05:19 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View