'సరిలేరు నీకెవ్వరూ'తో రంగంలోకి దిగుతోన్న మహేశ్ బాబు
Advertisement
మహేశ్ బాబు .. రష్మిక మందన నాయకా నాయికలుగా 'సరిలేరు నీకెవ్వరు' రూపొందనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు - అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల 2వ తేదీ నుంచి మొదలుకానుందనేది తాజా సమాచారం. తొలి షెడ్యూల్ షూటింగులో మహేశ్ బాబుతో పాటు రష్మిక కూడా పాల్గొననున్నట్టు సమాచారం. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఆర్మీ ఆఫీసర్ గా మహేశ్ బాబు కనిపించే ఈ సినిమాలో, జగపతిబాబు .. విజయశాంతి కీలకమైన పాత్రలను పోషించనున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Mon, Jun 24, 2019, 04:19 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View