'దొరసాని' మంచి ప్రేమకథా చిత్రమవుతుంది: హీరో రాజశేఖర్
Advertisement
రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ప్రధాన పాత్రధారిగా 'దొరసాని' సినిమా నిర్మితమైంది. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను, వచ్చేనెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. తాజా ఇంటర్వ్యూలో హీరో రాజశేఖర్ ఈ సినిమాను గురించి ప్రస్తావించారు.

'దొరసాని' సినిమా మంచి ప్రేమకథ. ఇది యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. సురేశ్ ప్రొడక్షన్స్ వారు సమర్పిస్తుండటం, యశ్ రంగినేని - మధుర శ్రీధర్ వంటివారు నిర్మాతలుగా వ్యవహరిస్తుండటాన్ని బట్టే ఈ కథలో విషయం ఉంటుందనేది అర్థమవుతుంది. సాంగ్స్ ను బట్టి చూస్తే ఆనంద్ దేవరకొండ .. శివాత్మిక మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టుగా అనిపిస్తోంది. ఇంత చక్కని ప్రేమకథా చిత్రం ద్వారా శివాత్మిక పరిచయమవుతుండటం ఆనందంగా వుంది" అని చెప్పుకొచ్చారు.
Mon, Jun 24, 2019, 03:16 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View